మనం ఏమి కోల్పోయినా తిరిగి పొందే వీలుంటుంది. అయితే ప్రాణాలు కోల్పోతే మాత్రం అంతా అయిపోయినట్టే. అందుకే ప్రతి నిమిషం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోకతప్పదు. ఆ వీడియోలో కుర్రాళ్లు త్రుటిలో తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఏమాత్రం తేడా జరిగినా వారందరూ భారీ ప్రవాహంలో కొట్టుకుని పోయి ప్రాణాలను కోల్పోయి ఉండేవారు