ఓ యువకుడు తన ప్రియురాలి పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. అయితే కేక్ కట్ చేసిన తర్వాత ప్రియురాలు మొదటి ముక్కను ప్రియుడికి కాకుండా, అక్కడే ఉన్న మరో యువకుడికి తినిపించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రియుడు.. బెలూన్లను పగులగొట్టి, కేకును ధ్వంసం చేస్తూ రచ్చ చేశాడు. ప్రియురాలు ఆపేందుకు ప్రయత్నించినా వినకుండా కేకును సదరు యువకుడిపైకి విసిరికొట్టాడు.