గుంటూరు జిల్లా తెనాలిలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో 8 చోట్ల చోరీలకు పాల్పడ్డారు. తెనాలి మండలంలో హాప్పేట, కొలకలూరు, కొల్లిపర సహా పలు గ్రామాల్లో బంగారం, నగదును చోరీ చేశారు. తాజాగా చెంచుపేటలోనీ డొంక రోడ్డులోని నాలుగు ఇళ్లల్లో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. ఓ అపార్ట్మెంట్లో చోరీకి యత్నించిన దుండగులు.. బీరువాలు వెతుకుతుండగా ఇంట్లో ఉన్నవారు అలికిడికి మేల్కొని అరవటంతో దొంగలు బైక్పై పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.