సంక్రాంతి పందాలకు సిద్ధం చేస్తున్న కోడి పుంజులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగల పాలవుతున్నాయి. లక్షల్లో విలువైన ఈ పుంజులను దొంగలు ఎత్తుకెళ్లడంతో పెంపకందారులు కంగారు పడుతున్నారు. దొంగతనానికి గురవుతున్న పుంజుల్లో ఒక్కొక్కటి 20 వేల నుంచి 50 వేల వరకు విలువ పలుకుతోంది. కొన్ని చోట్ల కాపలాదారులను కొట్టి మరీ దొంగతనాలు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో ఒకేసారి దాదాపు 30 కోళ్లు చోరీకి గురయ్యాయి, వాటి విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.