నిర్మల్ జిల్లా కేంద్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బంగల్ పేట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ముఖద్వారాన్ని పగలగొట్టి ఆలయంలోకి చోరబడ్డారు. అమ్మవారి మెడలోని పుస్తెలతాడు, బొట్టు బిళ్ళ, ముక్కుపుడక, చెవి కమ్మలతో పాటు ఆలయంలోని హుండీలను పగలగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారులు దొంగతనం జరిగిన విషయాన్ని తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.