స్కూల్ కోసం నూతన భవనం సాంక్షన్ అయి 6 నెలలు కావొస్తున్న భవన నిర్మాణం ప్రారంభించకపోవడంతో గ్రామస్తులు అందరూ కలిసి భవనాన్ని నిర్మించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మెట్లగూడెంలో నూతన ప్రాథమిక స్కూల్ నిర్మాణానికి అనుమతులు వచ్చినా కూడా అధికారులు ఎవరు కూడా ఇంత వరకు నిర్మాణం ప్రారంభించలేదు. దీంతో తమ పిల్లల భవిష్యత్తు కోసం గ్రామస్తులు అందరూ కలిసి వెదురు బొంగులతో చిన్న స్కూల్ నిర్మించుకున్నారు. ఆ పాఠశాలకు ఒక టీచర్ ను కూడా నియమించారు. గ్రామస్తులు నిర్మించిన ఆ పాఠశాలలోనే ఇప్పుడు క్లాస్లు నిర్వహిస్తున్నారు.