అనకాపల్లి జిల్లా చోడవరంలో ఆరు నెలల బిడ్డను చంపి, ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కనకమ హాలక్ష్మినగర్ లోని తమ ఇంట్లో వీణ, ఆమె 6 నెలల బాబు బుధవారం సాయంత్రం విగత జీవులై కనిపించారు. వీణ మెడకు చీర ఉరి వేసుకున్నట్టుగా ఉండగా.. ఆమె పక్కనే కన్నకొడుకు మృతదేహం ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.