మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బతికుండగానే రోగిని సిబ్బంది మార్చురీకి తరలించారు. అనంతరం అతడిని తిరిగి మార్చురీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి లోని ఐ.సి.యు కి తరలించి చికిత్స ను అందిస్తున్న క్రమంలో రోగి రాజు మృతి చెందాడు. అయితే ఊపిరితిత్తులు ,లివర్ , ఎనిమీయా తదితర వ్యాధులతో బాధపడుతున్న రాజును మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించేందుకు బంధువులు అంగీకరించలేదని.. అతడిని బతికించేందుకు డాక్టర్లు తీవ్రంగా కృషి చేశారని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని , పూర్తి స్థాయిలో విచారణ చేసి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.