యూపీ రాజధాని లక్నోలో అనవసరంగా హారన్ కొడుతూ పాదచారులను ఇబ్బంది పెట్టిన ఓ బైకర్‌కు CRPF జవాన్ తనదైన శైలిలో బుద్ధి చెప్పారు. రద్దీగా ఉన్న రోడ్డుపై సదరు యువకుడు పదేపదే పెద్ద శబ్దంతో హారన్ కొట్టడాన్ని గమనించిన జవాన్, అతడిని ఆపి అదే రీతిలో చెవి దగ్గర హారన్ మోగించారు. ధ్వని కాలుష్యం చేసే వారికి జవాన్ సరైన గుణపాఠం చెప్పారంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.