హిమాచల్ ప్రదేశ్లోని మనాలికి సమీపంలో ఉన్న సోలాంగ్ వ్యాలీలో గల అంజనీ మహాదేవ్ ఆలయం అద్భుతమైన దృశ్యం. 'బాహుబలి' సినిమాలో ప్రభాస్ శివలింగం ప్రతిష్ఠించినట్లుగానే.. ఇక్కడ 50 అడుగుల ఎత్తు నుంచి పారే జలపాతం నిరంతరం శివలింగానికి జలాభిషేకం చేస్తుంది. హనుమంతుని తల్లి అంజనీ దేవి ఇక్కడే తపస్సు చేశారని చెబుతారు. ప్రకృతి, పురాణం కలిసిన ఈ అద్భుత ఆధ్యాత్మిక కేంద్రాన్ని భక్తులు తప్పక సందర్శించాలి.