గ్రామ పురోగతికి సర్పంచ్ లే వెన్నెముక అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో, నియోజకవర్గ వ్యాప్తంగా తన మద్దతుతో నూతనంగా గెలుపొందిన సుమారు 82 మంది సర్పంచ్లను, ఉప సర్పంచ్లను , వార్డు సభ్యులను ఆయన ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధి అనేది సర్పంచ్ తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే విధి విధానాలపైనే ఆధారపడి ఉంటుందని ఎమ్యెల్యే పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వార్డు సభ్యులను కలుపుకొని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వ ఫలాలను ప్రజలకు చేరవేయాలని ఎమ్మెల్యే సూచించారు.