పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. 165 జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఆకివీడు పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులు విరిగి పడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు స్లాప్ నుండి నీళ్లు లీకేజీ అవ్వడంతో స్టేషనకు సంబంధించిన కంప్యూటర్స్, ఫైల్స్‌కు కవర్లు కప్పుకుని పోలీసులు పనిచేస్తున్నారు. పోలీస్ స్టేషన్ భవనం శిధిలావస్థకు చేరడంతో ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అనే భయంతో పోలీస్ సిబ్బంది పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలను ఆకివీడు పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.