ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన చోరీ కేసులను పోలీసులు చేధించి సొమ్మును రికవరీ చేసి బాధితులకు అందించారు. ద్వారకాతిరుమలలో గత నెలలో పోలిపోయిన లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి ఏడు కాసుల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఆ తరువాత చెరువు వీధిలో కాశీ అనే వ్యాపారి ఇంట్లో రెండు లక్షల నగదు దోచుకెళ్ళారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు త్వరితగతిన నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి పూర్తిస్థాయిలో రికవరీ చేసి బాధితుల ఇంటికి నేరుగా వెళ్లి ఏడుకాసుల బంగారు ఆభరణాలు, రెండు లక్షల నగదుతో పాటు ద్వారకాతిరుమలలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 29 మంది బాధితులకు స్వయంగా అందజేశారు.