నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో భక్తుల నమ్మకమే అమ్మగా వెలసిన మహా పోచమ్మ తన కొత్త ఆలయంలో, కొత్త రూపంలో కొలువుదీరింది. వేద పండితులు ఐదు రోజులపాటు నిర్వహించిన నిత్య హోమాలు మరియు ప్రత్యేక పూజల అనంతరం, ఈ రోజు వేకువజామున ప్రాణప్రతిష్ఠాపనోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం నాలుగు గంటలకు నిత్యనిధి, యంత్ర విగ్రహ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, కుంభాభిషేకం, కలశాభిషేకం వంటి పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.