బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. స్థానిక ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య యాదవ్ సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ నగదును అందజేశారు. రేపు నూతన సంవత్సరం ప్రారంభం కానుండటంతో, ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేయడంపై వృద్ధులు, వితంతువులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.