రజస్వల అయిన కుమార్తెను బయటికి పంపడం మంచిది కాదన్న మూఢనమ్మకంతో ఓ తల్లి తన కుమార్తెను మూడేళ్లుగా చీకటి గదిలో బంధించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలోని చక్రపాణి వీధిలో ఊళ్ల లక్ష్మీ తన కుమార్తె మౌనికతో నివాసముంటోంది. 2022లో మౌనిక రజస్వల అయ్యింది. అప్పటి నుంచి తల్లి లక్ష్మి మౌనికను చీకటి గదిలోనే బంధించింది. అయితే ఈ మూడేళ్ల కాలంలో చాలాసార్లు స్థానికులు మౌనిక గురించి అడిగినా సమాధానం ఇవ్వకపోవడంతో చైల్డ్ లైన్ అధికారులు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకుని మౌనికను బయటకు తీసుకురాగా ఆమె నడవలేని స్థితిలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు.