ఓ వీధి కోతి బైక్ రైడర్‌పై రెచ్చిపోయింది. వెంటాడి మరీ అతడిపై దాడి చేసింది. కోతి ఎగిరి తన్నటంతో బైకుపై నుంచి దూరంగా ఎగిరిపడ్డాడు. గాయాల పాలయ్యాడు. ఈ సంఘటన జార్ఖండ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. డుమ్కా జిల్లాలో ఓ కోతి నడిరోడ్డుపై కూర్చుని ఉంది. కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి బైకుపై దాని పక్క నుంచి ముందుకు వెళ్లాడు.