ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్ రోడ్‌పై అతివేగంతో ప్రమాదకరంగా కారు నడిపిన వ్యక్తిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. గరిష్ఠంగా 80 కి.మీ. వేగ పరిమితి ఉన్న చోట, లాంబోర్గిని కారులో 251 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన ఫయాజ్ అదాన్వాలా అనే వ్యక్తిపై వర్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, ఆ లగ్జరీ కారును సీజ్ చేశారు.