నీటిలో మునిగిన పులి.. వేట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోఓ సింహం పరుగు పరుగున దాని వెనుకగా వస్తుంది. చప్పుడు వినగానే పులి కూడా వెనక్కు తిరిగి చూస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి. పులులు, సింహాలు అంటేనే.. మెరుపు వేగంతో వెళ్లి దారుణంగా వేటాడే సంఘటనలే గుర్తుకొస్తుంటాయి. అయితే అప్పుడప్పుడూ ఇవి ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాయి. మనుషుల తరహాలోనే స్నేహంగా మెలగడం, ఒకదానిపై మరొకటి ప్రేమ చూపించడం వంటి పనులు కూడా చేస్తుంటాయి. ఇలాంటి అరుదైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం సడన్గా పులికి ఎదురుపడింది. రెండింటి మధ్య యుద్ధం జరుగుతుందనుకుంటే.. అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.