సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కావడి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. స్వామివారి కావడిని భూజాన ఎత్తుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుబ్రహ్మణ్య దీక్ష తీసుకున్న 270 మంది భక్తులు పేటతుళ్లి ఆడుతూ.. స్వామివారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై ఊరేగించారు. కావిడి పట్టుకున్న స్వాములు తమపై నుంచి దాటితే పిల్లలు పుడతారన్న నమ్మకంతో మహిళలు స్వాములు నడిచే దారిలో పడుకున్నారు. దీంతో స్వాములు వారిపై నుంచి కావడి పట్టుకుని దాటారు.