నిర్మల్ జిల్లా సారంగాపూర్లో ఆడెల్లి పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి గంగాజలంతో అభిషేకం నిర్వహించి భాజాభజంత్రీల నడుమ ఆలయ ప్రాంగణానికి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అమ్మవారి విగ్రహాలకు ఈ ఊరేగింపు కార్యక్రమానికి మహిళా భక్తులు మంగళ హారతులతో స్వాగతం పలికగా వేలాది భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు నుండి ఏడవ తేదీ వరకు ఐదు రోజులపాటు, గణపతి పూజ, నిత్య హవసనం, యాగశాల ప్రవేశం ,చండి పారాయణం, పుష్పాభినివాసం, నిత్యనిధి ,మూలమంత్ర ప్రతిష్టాపన, హోమం, సామూహిక కుంకుమార్చన, ప్రాణ ప్రతిష్ట ,పూర్ణాహుతి మంత్ర పుష్పాలతో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లు నిర్వహిస్తామని ఈ ఐదు రోజులపాటు జరిగే కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అన్నారు.