బెంగళూరుకు చెందిన ఓ డెలివరీ ఏజెంట్‌కు సంబంధించిన వీడియో వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మేము యంత్రాలం కాదు మనుషులమే అంటూ సాటి మనుషుల సానుభూతిని ఆయన కోరారు. ఒక గేటెడ్ కమ్యూనిటీలో అర కిలోమీటరు నడిచి వెళ్లి ఆర్డర్ అందించినా కనీసం మంచినీళ్లు కూడా అడగని కస్టమర్ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కంపెనీల పని ఒత్తిడి నిబంధనల మధ్య డెలివరీ భాగస్వాముల ఆత్మగౌరవం దెబ్బతింటోందని వాపోయారు.