స్కూలుకు వెళ్లే హడావిడిలో ఉన్న బిడ్డకు, వద్దని మారాం చేస్తున్నా తల్లి రోడ్డుపైకి వచ్చి మరీ గోరుముద్దలు తినిపించే దృశ్యం నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఈ వీడియో చూసిన 90s కిడ్స్ తమ బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఇలాంటి మమకారపు దృశ్యాలు కరువయ్యాయని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ప్రేమకు సాటి ఏదీ లేదని ఈ వీడియో మరోసారి నిరూపించింది.