దశాబ్దాల క్రితం కనుమరుగైన 'గిల్లీ దండ' ఆటను ప్రస్తుతం స్పెయిన్ దేశస్థులు ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గాలీషియా ప్రాంతంలో ఈ ఆటను 'బిల్లార్డా' అని పిలుస్తారు. వారసత్వ ఆటను రక్షించేందుకు పిల్లలకు నేర్పించి లీగ్స్ నిర్వహిస్తున్నారు. నేటి తరానికి తెలియని ఈ సంప్రదాయ ఆటకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.