అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మ పాలెం సముద్రం తీరంలో చేపలు వేటకు వెళ్ళిన మత్స్యకారుడు సూరాడ ముత్యాలు గల్లంతయ్యాడు. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లడంతో రాకాసి అలల తాకిడికి పడవ బోల్తా పడింది. అయితే పడవలో ఉన్న మిగిలిన మత్స్యకారులు గాయాలతో బయటపడ్డారు. ముత్యాల కోసం తోటి మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.