కర్నూలు జిల్లాలోని ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ...జేఏసీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా ఆదోని జిల్లా ఏర్పాటులో నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ...బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి క్యాంపు ఆఫీసును ముట్టడించారు. కార్యాలయానికి వస్తున్న ఎమ్మెల్యేను ప్రజలు అడ్డుకున్నారు. నిరసనకారులకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరోవైపు, విద్యార్థులు కూడా రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు.