జాతరలో సంగీతానికి తగ్గట్లుగా ఒక బాలుడు వేస్తున్న డ్యాన్స్ స్టెప్పులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే, అందరినీ మెప్పించింది ఆ బాలుడి ప్రతిభ కంటే, పక్కనే ఉండి తన కొడుకును ఉత్సాహపరుస్తూ.. ఈలలు వేస్తున్న ఆ తండ్రి సంతోషమే. అన్నట్లుగా ఆయన ఇచ్చిన ప్రోత్సాహం తండ్రీకొడుకుల అనుబంధానికి అద్దం పడుతోంది. పిల్లల ఆనందం కోసం తండ్రి పడే తపనను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.