తూర్పు ఇండోనేసియాలోని లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం సోమవారం బద్దలైంది. ఫ్లోర్స్ దీవిలోని మౌంట్ లెవొటోబి లకిలకిలో విస్ఫోటనాలు ఏర్పడుతున్నట్లు ఇండోనేసియా భూగర్భశాస్ర్త ఏజెన్సీ పేర్కొంది. అగ్నిపర్వతం నుంచి దాదాపు 18 కి.మీ. ఎత్తుకు మందపాటి బూడిద ఎగసిపడి సమీప గ్రామాలను కప్పివేసిందని తెలిపింది. దీంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.