మొరాకోలోని సాఫీలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. కుండపోత వర్షానికి దాదాపు 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. నగరంలో సుమారు 70 ఇళ్లు, దుకాణాలు నీట మునిగి దెబ్బతిన్నాయి. పదికి పైగా వాహనాలు కొట్టుకుపోయాయి. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో సాఫీలో స్కూళ్లకు 3 రోజుల పాటు సెలవు ప్రకటించారు.