మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలంలో వివాహేతర సంబంధానికి అడ్డొచ్చిన కవాడిగూడకు చెందిన వడ్లూరి లింగంను కూతురు మనీషా, తల్లి శారద, ప్రియుడు జావిద్ కలిసి హత్య చేశారు. కల్లులో నిద్రమాత్రలు కలిపి, మెత్తతో ఊపిరాడకుండా చేసి చంపిన తర్వాత, శవాన్ని క్యాబ్లో తీసుకెళ్లి ఎదులబాద్ చెరువులో పడేశారు. జులై 7న స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, సీసీ కెమెరాలు పరిశీలించి నిజం బయటపెట్టారు. ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.