రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) శతాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. శంషాబాద్ మండల కార్యదర్శి నర్ర గిరి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నపు ప్రభు ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు, జిల్లా కార్యదర్శి జంగయ్య పాల్గొన్నారు. 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సిపిఐ, గత వంద ఏళ్లుగా పేదలు, కార్మికుల పక్షాన నిలబడి అనేక వీరోచిత పోరాటాలు చేసిందని కొనియాడారు.