నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. స్థానిక ప్రజావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 34 మంది లబ్ధిదారులకు దాదాపు 18.20 లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవీయ కోణంలో ఆలోచించి, ఒక్క దరఖాస్తు కూడా తిరస్కరించకుండా ప్రతి బాధితుడికి ఆర్థిక సాయం అందేలా చూస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.