అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ మరోసారి కైవసం చేసుకుంది. గత చైర్మన్ తలారి రాజ్‌కుమార్‌ను ప్రభుత్వం తప్పించడంతో అనివార్యమైన ఈ ఎన్నికలను నేడు ఉదయం నిర్వహించారు. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో టీడీపీ, వైసీపీలు చెరో 11 మంది కౌన్సిలర్లతో సమానంగా ఉన్నా, ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుల రెండు కీలక ఓట్లు టీడీపీ అభ్యర్థికి దక్కాయి. దీంతో టీడీపీ తరఫున రంగంలోకి దిగిన 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి సోమశేఖర్.. వైసీపీ అభ్యర్థి లక్ష్మన్నపై 13 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.