ఉత్తర ప్రదేశ్లోని రాంపూర్(D)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్ల పైకి బస్సు దూసుకెళ్లింది. బిలాస్పూర్ మిల్టన్ ఎడ్యు కేషన్ అకాడమీకి చెందిన విద్యార్థులు బస్సు దిగి ముందు వైపు వెళ్లారు. పిల్లల్ని గమనించని డ్రైవర్ ముందుకు పోనివ్వడంతో అనబియ(7) టైర్ల కింద పడి చనిపోయింది. బస్సు మధ్యలో పడటంతో జన్నత్ (4) స్వల్ప గాయాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ అక్కడి CCTVలో రికార్డయ్యాయి.