పెళ్లికి ముందు మాజీ ప్రియుడిని కలిసిన వధువు అంటూ వైరల్ అయిన వీడియో కేవలం స్క్రిప్టెడ్ (నటన) అని సదరు యువతి స్పష్టం చేసింది. తన అనుమతి లేకుండా, ఎడిట్ చేయమని కోరినా పట్టించుకోకుండా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వ్యూస్ కోసమే సదరు కంటెంట్ క్రియేటర్ ఇలాంటి వివాదాస్పద వీడియోలు రూపొందిస్తున్నారని వెల్లడైంది.