శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మండలం మామిళ్ళకుంట క్రాస్ రైల్వే కాంట్రాక్టర్ జయప్రకాశ్–శ్రీవాణి దంపతుల ఇంటి ఆవరణంలో.. అరుదైన బ్రహ్మ కమలం వికసించింది. శుక్రవారం అమావాస్య రోజున బ్రహ్మ కమలం పూయడంతో ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మహిళలు పసుపు–కుంకుమ పెట్టి, కొబ్బరికాయ కొట్టి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమావాస్య రోజున బ్రహ్మ కమలం పూయడం ఎంతో శుభసూచకమని, బ్రహ్మదేవుడే మా ఇంటికి వచ్చినట్లుగా భావిస్తున్నామని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బ్రహ్మకమలం పుష్పాన్ని చూసేందుకు తరలివస్తున్నారు.