దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ 7వ స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిగణనలోకి తీసుకుంది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసే ఈ ప్రక్రియలో.. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో అగ్రస్థానాన్ని, దేశంలో ప్రతిష్టాత్మకమైన ఏడో ర్యాంకును సాధించింది.