బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ చేసిన పని ప్రస్తుతం వైరల్ అవుతోంది. అర్ధరాత్రి రాపిడో ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ, డ్రైవర్ చూపిన ఆత్మీయతతో తాను పూర్తి భద్రంగా ఉన్నట్లు అనుభూతి చెందానని ఒక వీడియోలో పంచుకుంది. ఆటోలో అతికించిన ఒక చేతిరాత నోటీసును చూపించింది. అందులో 'నేను కూడా ఓ తండ్రిని, ఓ అన్నను. మీ భద్రతే నాకు ముఖ్యం. సౌకర్యంగా కూర్చోండి' అని రాసి ఉంది. ఈ సందేశం వైరల్గా మారింది.