కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు కాలం గడుస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అధికారుల తీరు మాత్రం ఏమాత్రం మారలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కదిరి రూరల్ మండలం కుమ్మర వాండ్లపల్లి సచివాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల పట్టిక సచివాలయంలో అతికించారు. పట్టించుకోవాల్సిన అధికారులు ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో సచివాలయం సిబ్బంది నిమ్మకు నీరుతున్నట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తొలగించాలని గ్రామస్తులు, కూటమి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.