రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ క్లినిక్‌కు విశేష స్పందన లభిస్తోంది. శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌కు అర్జీదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, పెనుగొండ రెవెన్యూ డివిజన్లకు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి అర్జీదారుల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి పరిష్కరించే చర్యలు చేపట్టారు. దళారులను ఆశ్రయించకుండా నేరుగా వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు.