అమెరికాలోని టెక్సాస్‌లో వరద బీభత్సానికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 82కు చేరింది. పదుల సంఖ్యలో ప్రజల ఆచూకీ గల్లంతైంది. కెర్ కౌంటీలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 40 మంది పెద్దలు, 28 మంది చిన్నారులు ఉన్నారు. తాజాగా ఆ రాష్ట్రంలోని లానో నది, కింగ్స్‌ల్యాండ్ స్లాబ్‌కు చెందిన ఓ వీడియో మెరుపు వరద తీవ్రతను కళ్లకు కట్టింది. జులై 4వ తేదీన కేవలం నిమిషాల వ్యవధిలోనే నీటి ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. తన దారికి అడ్డువచ్చిన అన్నింటినీ ఈడ్చుకుపోయింది.