జమ్మూకశ్మీర్లోని సాంబా సెక్టార్లో గురువారం అర్ధరాత్రి కొందరు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి చొరబాటుకు ప్రయత్నించారు. దీన్ని బీఎస్ఎఫ్ భగ్నం చేసింది. ఈక్రమంలో బీఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరి కదలికలను భారత నిఘావ్యవస్థ కనిపెట్టింది.