శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహార్ నవోదయ విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న ప్రణీత ఉరేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది. కావలి రూరల్ అడవిరాజుపాళెంకి చెందిన ప్రణీత చదువుల్లో ముందుండేది. ఆమె తండ్రి కొండాపురం MEOగా పనిచేస్తున్నారు. బాగా చదువుతుందనే ఈర్ష్యతో, తోటి విద్యార్ధినిలు మాటలతో వేధించడం వలన ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు ప్రణీత మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.