దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా, ఒక టెకీ జంట తమ వివాహ రిసెప్షన్‌ను ఆన్లైన్లో నిర్వహించాల్సి వచ్చింది. విమానాలు రద్దు కావడంతో పెళ్లి తర్వాత రిసెప్షన్ కోసం నిర్ణయించుకున్న నగరానికి వారు సమయానికి చేరుకోలేకపోయారు. దీంతో, బంధుమిత్రులు, స్నేహితులంతా వారికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో, ఈ టెకీ దంపతులు వర్చువల్ వేదికగా రిసెప్షన్ వేడుకను నిర్వహించుకున్నారు.