నోరు లేని మూగ జీవాలతో అక్రమ వ్యాపారం సాగిస్తున్న కొందరి తీరు సభ్య సమాజాన్ని ఆలోచింప జేస్తోంది. మేము ఏం పాపం చేశామో అంటూ ఓ గోవు మూగరోదనతో కంట కన్నీరు కార్చిన దృశ్యం చూపరుల మనసు కలచివేస్తోంది. నల్లగొండ పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ కంటైనర్ లారీలో తాళ్లతో బంధించబడి ఉన్న ఓ గోవు ఆర్తనాదం ఆవేదన కలిగిస్తోంది. నల్గొండ జిల్లా అద్దంకి-నార్కట్ పల్లి హైవే పై భారీ కంటైనర్ లారీలో తరలిస్తున్న గోవులను భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పట్టుకుని టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. గోశాలకు పంపకుండా ఆలస్యం కావడంతో అక్కడే గోవులు గోసపడ్డాయి. మేత, నీరు లేకపోవడంతో అందులో రెండు ఆవులు మృతి చెందాయి.