హనుమకొండ పెగడపల్లి డబ్బాలలోని ఏకశిల హైస్కూల్లో 4వ తరగతి చిన్నారిని ఉపాధ్యాయురాలు చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. చిన్నారి వీపు, పొట్ట, కాళ్లు, చేతులు, ముఖంపై తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో పాఠశాలకు చేరుకున్న విద్యార్ధి తల్లిదండ్రులు.. యాజమాన్యాన్ని నిలదీని.. ఉపాధ్యాయురాలి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.