భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తో టాటా పంచ్ కార్ అగ్నికి ఆహుతి అయింది.నల్లపోతుల నాగరాజు అనే ఓ ప్రభుత్వ టీచర్ తన TS28 8621 నంబర్ గల టాటా పంచ్ కారులో బయట నుండి ఇంటికి వచ్చి కార్ పార్క్ చేసి లోనికి వెళ్ళగానే కార్ నుండి పొగలు రావడం ప్రారంభమై కార్ మొత్తం మంటలు వ్యాపించాయి.