పవిత్ర గోదావరి నది గొప్పదనాన్ని దేశమంతా తెలియజేయడానికి మహారాష్ట్రలోని నాసిక్ నుండి 500 మందికి పైగా స్వామీజీల బృందం యాత్రగా బయలుదేరి కాకినాడ జిల్లాలోని పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. వీరు ఇక్కడ స్వయంభూ దత్తాత్రేయ స్వామి, కుక్కుటేశ్వర స్వామి, పదవ శక్తిపీఠం పురుహూతికా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సనాతన ధర్మం, హిందువుల ఐక్యత కోసం, గోదావరిని పరిశుభ్రంగా ఉంచాలని కోరుతూ ఈ యాత్ర చేస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో దేవాలయాలను దర్శించుకుంటూ యానాం ద్వారా సముద్ర మార్గంలో తిరిగి నాసిక్ చేరుకుంటామని స్వామీజీలు తెలిపారు.