బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండ్యన్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న ఓపీ సేవలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వైద్యుల పనితీరును వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా వైద్య సిబ్బంది ఎఫ్ఆర్ఎస్ ఆన్లైన్ హాజరు, ల్యాబ్ సౌకర్యాలు , మందుల నిల్వపై కమిషనర్ ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 24 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ విభాగం పనులను పర్యవేక్షించారు. అత్యవసర వైద్య సేవలు ప్రజలకు త్వరగా అందుబాటులోకి రావాలని, నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు