10వ ఫ్లోర్ నుంచి పడినా ప్రాణాలతో బయటపడ్డాడో వ్యక్తి. గుజరాత్‌లోని సూరత్‌లో నితిన్ ఆదిత్య(57) కిటికీ దగ్గర పడుకున్నారు. నిద్రలో పక్కకి జారి కిందపడిపోయారు. అదృష్టవశాత్తు 8వ ఫ్లోర్ కిటికీలో చిక్కుకున్నారు. దీంతో ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి ఆయన్ను కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.